29 November 2016

సినిమా థియేటర్లలో జాతీయగీతం సుప్రీమ కోర్టు ఆర్డర్


సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపనపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు.  జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో  ప్రేక్షకులు అందరూ కచ్చితంగా నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా  ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది.