29 November 2016

Latest update #NTR27 with Director Bobby


Official Announcement awaited
 ఎన్టీఆర్-బాబీ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ 
-

యంగ్ టైగర్ తనర్ చేయబోయే సినిమా కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా రేసులోకి వచ్చాడు సర్దార్ గబ్బర్ సింగ్ తో సైలెంట్ అయిపోయిన దర్శకుడు బాబీ.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వరుస హిట్లతో జోరు మీదున్న హీరోని మెప్పించే౦త కథ బాబీ దగ్గర ఏముందని ఇండస్ట్రీలో ఆరాలు తీయగా ఓ మైతలాజికల్ సోషియో ఫాంటసీ కథని ఎన్టీఆర్ కి వినిపించి ఒప్పించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

  
అందువలనే ఏ దర్శకుడితో ఫైనల్ కానీ ఎన్టీఆర్ బాబీ దగ్గర లాక్ అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నట్లు సమాచారం.