22 December 2016

3G మొబైల్స్ లో జియో సిమ్ పని చేస్తుందా??

ఉచితంగా ఇంటర్నెట్ డేటాతోపాటు ఫోన్ కాల్స్ ఇస్తూ టెలికాం రంగంలో దూసుకు వెళ్తున్న జియో  వినియోగదారులకు మరో ఆఫర్ అందించేందుకు సిద్ధమైంది. 

ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియోగదారులకు చేరువైన జియో ఇకపై 3జీ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఇప్పటి వరకు 4జీ ఫోన్లలో మాత్రమే పనిచేస్తున్న జియో సిమ్‌లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా సంస్థ ఓ యాప్‌ను రూపొందిస్తోంది. డిసెంబర్ చివరలో లేదా వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

జనవరి 1న ‘ న్యూఇయర్‌ ఆఫర్‌’ కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. మొదట డిసెంబర్‌ 31 వరకు ‘వెల్‌కమ్‌ ఆఫర్‌’ కింద ఉచిత కాల్స్‌, అపరిమిత డేటా సౌకర్యం కల్పించిన జియో.. ఆ ఆఫర్‌ను మార్చి 31 వరకు ఇటీవల పొడిగించింది. 

ఇప్పటికే 5.2కోట్లమంది తమ చందాదారులుగా చేరినట్లు కంపెనీ ఇది వరకే  ప్రకటించింది. అయితే మరింత మందికి చేరువయ్యే ఉద్దేశంతో 3జీ కస్టమర్ల కోసం తాజాగా యాప్‌ను సిద్ధంచేస్తోంది.