22 December 2016

Jr.NTR తో పాటు డ్యాన్స్ చేయడం చాలా చాలా కష్టం’’ అంటూ జూనియర్ ను ఆకాశానికెత్తేసిన సమంత.


అందం, అభినయంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక సమంత. ఇవాళ సాయంత్రం ఆమె అభిమానులతో ఫేస్‌బుక్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్నారు. ఈరోజు (21-12-2016) సాయంత్రం 4 గంటలకు సమంత ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి రాగా.. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెని బెస్ట్ డ్యాన్సర్ ఎవరని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా ఎన్టీఆర్ అని ఠక్కున రిప్లై ఇచ్చింది. అలాగే.. తారక్ మంచి వ్యక్తి అని, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, అతనితో మరోసారి జతకట్టేందుకు తాను రెడీ అని చెప్పుకొచ్చింది.
‘‘ఎన్టీఆర్ ఏదైనా డ్యాన్స్ మూమెంట్స్ ఒక్కసారి చూశాడంటే చాలు అలాగే గుర్తు పెట్టేసుకుంటాడు. ఏమాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా స్టెప్పులు వేసేస్తాడు. అతడితో పాటు డ్యాన్స్ చేయడం చాలా చాలా కష్టం’’ అంటూ జూనియర్ ను ఆకాశానికెత్తేసింది సమంత.