5 December 2016

వైరల్ : కొత్త 20, 50 నోట్ల ఫస్ట్ లుక్


దేశంలో చిల్లర కొరత తీర్చేందుకు త్వరలోనే రూ.20, రూ.50 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది RBI. పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని వెల్ల
డించింది. కొత్త నోట్లకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని.. అతిత్వరలోనే మార్కెట్ లోకి వస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొత్త 20, 50 నోట్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది.

… రూ.20 నోటు గ్రీన్ కలర్ లో ఉంది. ముంబై ల్యాండ్ మార్క్ అయిన గేట్ వే ఆఫ్ ఇండియా సింబల్ ఉంది. నోటు మధ్యలో రూపీ సింబల్ పెద్దగా ఉంది. కుడి వైపు పైన భారత చిహ్నం ఉంది. దాని కింద రూ.20 అని ఉంది. ఎడమవైపు పైన కూడా రూపీ ఉంది. RBI సీల్ ఉంది.

… రూ.50 నోటు లైట్ మెజంటా కలర్ లో ఉంది. ఎర్రకోట బొమ్మ ఉంది. మధ్యలో రూపీ సింబల్ పెద్దగా ఉంది. కుడివైపు పైన భారత చిహ్నం, ఆ కింద రూ.50 అని ఉంది. ఎడమ వైపు పైన రూ.50 అని ఉంది. ఆ కింద RBI సీల్ ఉంది.

సోషల్ మీడియాలో కొత్త 50, 20 నోట్ల ఇవే అంటూ వైరల్ అవుతోంది. News24onlineలో ప్రముఖంగా ప్రచురించారు. RBI మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్త నోట్ల డిజైన్ కు అఫిషియల్ గా విడుదల చేయలేదు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.