12 December 2016

రూ. 149తో జియోకి షాకిస్తున్న బిఎస్ఎన్ఎల్

ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్లతో దూసుకుపోగా ఇప్పుడు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ రూ. 149 అన్ లిమిటెడ్ అంటూ దూసుకొస్తోంది.


మార్చి 31 2017 వరకు జియో ఉచితమంటూ ప్రకటించిన నేపథ్యంలో టెల్కోలు అన్నీ ఇప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో కష్టమర్లను ఆకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయ. ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్లతో దూసుకుపోగా ఇప్పుడు ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ రూ. 149 అన్ లిమిటెడ్ అంటూ దూసుకొస్తోంది. జనవరి నుంచి ఈ అన్ లిమిటెడ్ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.