ఉచిత డేటా ఆఫర్లతో దూసుకుపోతున్న జియో దెబ్బకు టెల్కోలు భారీ నష్టాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలకమ్ ఆఫర్ తరువాత హ్యపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ మరో మూడు నెలలు ఉచితంగా జియో డేటా సేవలు పొందవచ్చని చెప్పడంతో టెల్కోలు కూడా ఆఫర్లు ప్రకటించిక తప్పని పరిస్థితి ఎదురయింది. అయితే ఈ ఆఫర్ లో జియో డేటా కేవలం రోజుకు 1 జిబి మాత్రమే వాడుకోవచ్చని ఆ తరువాత డేటా స్పీడ్ స్లో అవుతుందని జియో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఇప్పుడు జియో పరిష్కారం చూపనుంది.
జియో ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో రోజుకు 1జిబి డేటా మాత్రమే హై స్పీడ్ గా ఉంటుందని మిగిలిన డేటా స్పీడ్ తగ్గుతుందని జియో ఇది వరకే ప్రకటించింది.
జియో ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో రోజుకు 1జిబి డేటా మాత్రమే హై స్పీడ్ గా ఉంటుందని మిగిలిన డేటా స్పీడ్ తగ్గుతుందని జియో ఇది వరకే ప్రకటించింది.
అయితే మీకు 1జిబి తరువాత కూడా జియో డేటా హై స్పీడ్ లో రావాలంటే రూ. 51 తో రీ ఛార్జ్ చేసుకోవాలని దీని ద్వారా జియో హై స్పీడ్ డేటాను పొందవచ్చని జియో అనుకుంటోందని సమాచారం.
రూ. 301 ప్లాన్ లో అయితే 28 రోజుల పాటు 6జిబి 4జీ డేటా వస్తుంది. అలాగే నైట్ అన్ లిమిటెడ్ డేటా. 2017 వరకు ఈ ఫ్లాన్ పరిమితం. వాయిస్ కాల్స్ ఫ్రీ.
ఈ రీచార్జ్ లు రూ. 51 నుంచి స్టార్ట్ అయి రూ. 301 వరకు ఉంటాయని ఈ ప్లాన్ లో మీరు డేటా స్పీడ్ ని 128 కెబిపిఎస్ లో అందుకుంటారని సోషల్ మీడీయాలో కొన్ని కథనాలు వస్తున్నాయి.
- అయితే ఈ ఆఫర్ గురించి జియో నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.