త్వరలో ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ నౌగట్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది
షియోమి ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. ఈ ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ నౌగట్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఎంఐయూఐ 9కు ఇవ్వనుంది.
దీని ప్రకారం .. షియోమీ సరికొత్త ఫోన్లు అయిన ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్, ఎంఐ 4 సి, ఎంఐ 4 ఎస్ తొలుత ఈ అప్డేట్ను అందుకోనున్నాయి. ఎంఐ మిక్స్, ఎంఐ నోట్2, ఎంఐ 5 ఎస్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా తెలపనప్పటికీ .. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.
కాగా ఇటీవలే ఎంఐ 5 కి ఈ కొత్త అప్డేట్ వచ్చింది. అయితే, అప్డేట్కు సంబంధించి అదే కంపెనీకి చెందిన రెడ్మీ సిరీస్ గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.