15 December 2016

అమెజాన్ సంచలనం..13 నిమిషాల్లోనే సరుకు డెలివరీ




మీరు అమెజాన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేస్తున్నారా..వాటి కోసం మీరు రెండు మూడు రోజులు ఎదురుచూస్తున్నారా..అయితే ఇకపై మీరు ఎదురుచూపులకు సెలవు చెప్పేయవచ్చు. అమెజాన్ ఇప్పుడు సరుకులను కేవలం 13 నిమిషాల్లోనే డెలివరీ ఇవ్వనుంది. అది మనుషుల ద్వారా కాకుండా డ్రోన్ల ద్వారాఈ డెలివరీ చేయనుంది. రానున్న కాలంలో అమెజాన్ సేవలన్నీ డ్రోన్ల ద్వారానే అందుతాయని అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ స్పష్టం చేశారు.



ఆర్డరు చేసిన 13 నిమిషాల్లోనే
అమెజాన్ డ్రోన్ల ద్వారా కష్టమర్లకు సర్వీసును అందించాలనే ప్రయత్నం తొలిసారిగా విజయవంతంమైంది. ఇంగ్లండ్ నగరంలోని ఓ వ్యక్తి ఆర్డరు చేసిన 13 నిమిషాల్లోనే ఆ కష్టమర్ ఇంటికి నేరుగా ఆర్డరు చేసిన ప్రొడక్ట్ వచ్చి చేరింది. కష్టమర్ ఇది కలా నిజమా అని ఆశ్చర్యపోయారు.


అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్
అయితే మాములుగా ఇంటర్నెట్లో ఆర్డరుచేసిన వస్తువులను డెలివరీ బాయ్ మనకు అందిస్తాడు. అయితే దీనికి పుల్ స్టాప్ పెట్టాలని అమెజాన్ బావిస్తోంది. డెలివరీ బాయ్ లతో పనిలేకుండా డ్రోన్ల ద్వారానే డెలివరీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Click here to watch : Amazon air Delivery