1 December 2016

డిసెంబర్ 10న ఎన్టీఆర్ సినిమా ముహూర్తం



-
సర్దార్ గబ్బర్ సింగ్ ఫేం బాబీ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ఆ సినిమా త్వరలో సెట్స్ పైకి వేల్లబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ కథ రైటర్ కోన వెంకట్ ది కావడం, ఆ కథకి అల్ రెడీ అభిషేక్ బచ్చన్ కోన వెంకట్ చెప్పి అడ్వాన్స్ పుచ్చుకోవడం జరిగిపోయిందని, ఆ ప్రాజెక్ట్ ని వదిలేయడానికి అభిషేక్ బచ్చన్ రెడీగా లేదని సమాచారం. దాంతో ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం బాబి చేజారిందని అంతా ఫిక్స్ అయ్యారు.

కానీ అటువంటిది జరగలేదు. ఎన్టీఆర్ తదుపరి సినిమాకి బాబినే దర్శకత్వం వహించబోతున్నాడు. కోన వెంకట్ కథ కాకుండా, బాబి మరో కథని ఎన్టీఆర్ కి చెప్పాడట. ఆ కథ నచ్చిందట. దాంతో ఆ కథతో ముందుకేల్దామని, కోన వెంకట్ కథ వదిలేద్దామని చెప్పేశాడట ఎన్టీఆర్. అలా బాబికి రూట్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 10న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపి, జనవరిలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారమ్.